Tuesday 24 March 2009

అంతా(క)క్షరి

ఆ రోజు అక్టోబర్ పది అంటే చెన్నై లో అన్ని రోజుల్లాగానే మండే ఎండ. మేము హైదరాబాద్ వెళ్లేందుకు స్టేషన్ కి బయలుదేరాము. మా వూళ్ళో నీళ్ళతో రెండు సార్లు , ఎండ వుక్క తో మరి ఆరు సార్లు స్నానం చేస్తాం.
స్టేషను చేరే సరికి నా సిల్కు చొక్కా కలర్ మారింది (చెమటకి ముద్దయ్యి). ట్రైన్ ఎక్కి కూర్చున్నాము నేను నా భార్య శారద. మా ఊరి ప్రత్యేకతేమిటంటే సరిహద్దుల దగ్గిర మురుగు కంపు తో ఆహ్వానిస్తుంది మళ్ళీ అదే వాసన తో సాగనంపుతుంది. అలాగే ఆ రోజు కూడా మమ్మల్ని వుక్కిరి బిక్కిరి చేసింది.
ట్రైన్ ఓ మోస్తరు స్పీడు అందుకోవటంలో , నా చొక్కామీద కొత్త మేప్స్ తయారయ్యాయి... సిల్కు చోకా మీద చేమటారుతుంటే అంతే. చెన్నై వాసులికి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. "అమ్మయ్య ఇంక హాయిగా ఓ కునుకేయ్యచ్చు" అనుకుంటూంటే పక్కనే వున్న ఓ ఫ్యామిలీ సరదాగా తమిళంలో అంతాక్షరి అందుకున్నారు. నా వైఫ్ రాబోయే ముప్పుని పసిగట్టి నా ఐపాడ్ లాక్కుని యియర్ ఫూన్లు తగిలించుకుని సెటిల్ అయింది.
"ఇదెప్పుడూ ఇంతే.. సరదాలే లేవు.. ఎంచక్కా మనం కూడా కాసిని పాటలు పాడుకోవచ్చు..
సర్లే , దాని అదృష్టం అంతే ... మరి నా అద్రుష్టానికొస్తే..

ఇంతట్లో పల్లీల వాడొస్తే అందరికీ పల్లీలు కొనిపెట్టా
"చెన్నై పల్లీలు చాల బాగుంటాయండి" అన్నాను "ఎస్. నిండా బాగుందండి" అన్నారు. " మీరు చెన్నై లో వర్క్ చేస్తారా" అని అడిగా. "కాదండి అమెరికా లో దా వుందాము... లీవుకి ఒక మాసానికి వస్తిమి" అన్నాడు "నా పేరు రామన్ , నా వైఫ్ రాధ , పిల్లలు వాసన్ , దేవన్ " అని వాళ్ళని నాకు పరిచయం చేసాడు రామన్.
నాలుగు సంవత్సరాల తరువాత ఇండియా వెకేషన్ కొచ్చారట .

రామన్ పేరెంట్స్ చెన్నైలోను రాధ పేరెంట్స్ హైదరాబాదులోను వుంటారుట. చెన్నై వచ్చి చక్కగా అత్తగారి దగ్గర నాలుగు రోజులుండి ఆ మిగిలిన ఇరవై రోజులు తన పేరెంట్స్ తో వుందామని వెళ్తున్నామంది రాధ. అప్పుడ్నాకర్ధమయింది అత్తా కోడళ్ళు చెన్నై స్టేషనులో ఒకల్నోకల్లు విడిచి వుండలేనంత ప్రేమ ఒలకబోసుకున్నారో అని ... బండి కదలగానే రాధ మంచి హుషారయిన పాటలన్దుకుంది. మొగుడికి ఓ మంచి ఇళయరాజా పాట అందించింది, రామన్ మాత్రం విషాద గేయాన్ని అందుకున్నాడు..

ట్రైను స్పీడుతో పాటు వీళ్ళ పాటల సెలక్షన్ కూడా పెరిగింది. పై బెర్తుల్లోకేక్కిన పిల్లలు కూడా రంగంలోకి (రణరంగం అనాలి) దిగారు. ఆ పక్కనే నా తోడుగా వున్న నా భార్య నన్నొదిలి హాయిగా గురక పెడుతోంది. పిల్లలకి ఇంగ్లీషు , తమింగ్లీషు, తెలుగీషు , హింగ్లీషు వచ్చేమో, నాలుగు భాషలలో పాడి కంపార్టుమెంటులో వున్న అందరినీ భాద పెడుతున్నారు. బహుశా రామన్ డాలర్లు ఒలకపోసి అమెరికాలో సంగీతం నేర్పించినట్టున్నాడు, వాసన్ శంకరాభరణం పాటలందుకున్నాడు. శంకరశాస్త్రి కోచ్చినంత కోపం వచ్చి శారదా..... అని ట్రైన్ డ్రైవరుకు వినిపించేలా అరుద్దామనుకుంటే పక్కనే పడుకున్న నా పెళ్ళాం శారద లేచి తన పాట అందుకుంతుదేమో...అన్నా భయం.


నే మొక్కిన దేముళ్ళు కరుణించి... వెంట వెంటనే ఓ నాలుగు గూడ్సు బండ్లని పంపారు. ఓ అయిదు నిముషాలు పాటు ట్రైన్ సౌండుతో కంపార్తుమేంట్లో అందరూ రిలాక్సయ్యారు. ఇంతట్లోనే తీసీ కూడా వచ్చి టికెట్స్ చెక్ చేసి పారిపోయాడు. ఇంకెక్కడికి సీటు మార్చడం కుదరదన్నాడు.
బయట సౌండ్లు సద్దుమనిగాక మల్లి అందుకున్నారు అంతాక్షరి .. లక్కీ గా ట్రైన్ ద్రైవరికి మెసేజ్ అందిందో ఏమో, ట్రైన్ స్పీడ్ పెంచాడు. దాంతో ట్రైను సౌండు వీళ్ళ సౌన్డుకన్నా ఎక్కువవ్వటంతో కాస్త నీరసించారు...

నా ఫోకస్సంతా ఆ ఆరవ ఫ్యామిలీ మళ్ళీ అరవకుండా చేయడం ఎలా అనే దాని మీదే వుంది. ఇంతలోకే శారద నిద్ర లేచింది. పెళ్ళయి పదేళ్ళలో... నేను కూడా ఇంత భాద పెట్టలేదని నా మీద చాల జాలి పడింది. ఈ హక్కు తనకోక్కత్తికే పరిమితమని .. దీనికి రామన్ గాంగ్ కారణమని తెలుసుకుని వాళ్లకి మా అమెరికా ట్రిప్ విషయాలు చెప్పటం స్టార్ట్ చేసింది. దాంతో అన్ని నోళ్ళూ మూతబడ్డాయి. శారద బిజీ అయిపోయింది... రామన్ కి చెమటలు పట్టాయి....
బిక్క మొహంపెట్టి ఎప్పుడు ఇంకో నాలుగు గూడ్సు బండ్లు వస్తాయా అని కిటికీలోంచి నిముషానికి పది సార్లు తొంగి చూస్తున్నాడు...

Saturday 10 January 2009

ఎలిజెబెత్తు...పిలకజుత్తు... - డిసెంబరు 2008


అమలాపురంలో ఐదో తరగతి దాకా చదివి ఆరో తరగతినించి లండన్ లో వెలగబెట్టిన పరశురాం ముప్పై అయిదేళ్లకు బాగా సెటిల్ అయ్యాడు. ఇంక పెళ్లికి వేళాయెరా అని పిల్లని వెతకమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు వాళ్ల అమ్మకి. ఫ్రీ మ్యుసియుమ్సులో చాలా సార్లు ఎలిజెబెత్ రాణి ఫోటోలు చూసిన తల్లి నరసమాంబకి అలా తెల్లగా మంచి పొడుగైన జుత్తుతో వుండే పిల్లే తన కొడుక్కి సరయిన జోడి అని డిసైడ్ చేసింది. పరశురాం చూడ్డానికి నల్లగా వున్నా జుట్టు మట్టుకు తెల్లగా వుంటుంది. కళ్లు చిన్నగా వున్నా ముక్కు మట్టుకు పెద్దగా వుంటుంది. ప్రొఫెషనల్గా బాగా సక్సెస్ అయ్యాడు పరశురాం. బీయండబల్యూ కారు, రోలేక్సు వాచీ , కొత్త సెల్ఫోన్లతో ఎప్పుడూ కళకళ లాడిపోతుంటాడు. నరసమాంబ మట్టుకు తన కొడుకు లాంటి ఆరడుగులు అందగాడు దొరకాలంటే బక్కెట్టు బక్కెట్ల పుణ్యం చేసుకుని వుండాలి అని వూహాలోకంలో వుంటుంది. సొంత వూరైన అమలాపురంకి ఈ పనిమీద వెంటనే పెట్టె బేడా సద్దుకుని వెంటనే బయలు దేరింది...

తన కొడుకు ఫోటోలు అన్ని మ్యారేజ్ బ్యూరోలలోను (అంటే సంత), డాట్ కాంలలోను యాడ్ ఇచ్చి ఎంచక్కా కూర్చుంది. 10 ఫోటోలు 20 ఫోన్ కాల్స్ 50 ఈమైల్సు వచ్చాయి... కానీ ఫోటోకి మనిషికీ నందికి పందికి వున్నంత తేడావుంది. అసలు తన కొడుక్కి తననుకున్నట్లు పిల్ల దొరుకుతుందా అని బెంగ పెట్టేసుకుంది నరసమాంబ. అమ్మే వాళ్ళెప్పుడు సరుకు ఫ్రెష్షే అనుకుంటారు...పుచ్చులూ చచ్చులూ కొనే వాళ్ళకే తెలుస్తుందన్నట్టు.. డిగ్రీ ఎలాగో గట్తెక్కించి పక్క సందులో వున్న పాక్స్-అకాడమీ లో అంటే పాపయ్య అకాడమీ అఫ్ కంప్యుటర్సులో డిప్లొమా పూర్తి చేసింది గిరిజ. పక్కింటి తాతగారు గిరిజ ఎ అమెరికాలోనో ఆస్ట్రేలియా లోనో సెటిల్ అవుతుంది అని అమ్మాయిని అడిగి చేసుకుంటారని చెప్పటంతో గిరిజ తండ్రి సుందరం గిరిజకి ముప్పై ఏళ్ళొచ్చినా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నాడు. ఇంక ఏమి సంబంధాలు రాక పోయే సరికి ఇంక ఈ వెధవ జాతకాలని నమ్మి కూర్చుంటే తన కూతురుకి ఏ ముసలో ముతకనో కట్టబెట్టడం ఖాయమనుకుని , గిరిజ ఫోటో , బయోడేటాని అన్ని మ్యారేజ్ సంస్థలలోనూ నమోదు చేసాడు. ఇంటర్నెట్ పెళ్లి సంతలలో కూడా ఫోటో పెట్టాడు. గిరిజ చదువు తెలివితేటలలో కొంచం తక్కువైనా మంచి అందగత్తె. అందం పెరుగుతున్న కొద్ది బుర్ర మీద జుట్టు తగ్గుతూ వచ్చింది. డెబ్భై అయిదు చానల్స్ లో వచ్చే అన్ని మందులూ, క్రీములూ వాడింది. కాని రోజు రోజుకి తరుగుదల పెరిగిపోతోంది. తొందరగా పెళ్ళయితే వున్నా వూడినా ఇంక పట్టించుకోవక్కరలేదులే ఎలాగూ మొగుడుకి వున్న కాస్త వూడటం ఖాయమని ధీమాగా వుంది గిరిజ.

సుందరం అన్నయ్య అమలాపురం లో నరసమాంబ గారి ఎదురింట్లోనే వుండడంతో, గిరిజ ఫోటో, బయో-డేటా తో సహా వచ్చింది. ఇరవై రెండవ ఏట తీయించుకున్న ఫోటో అవ్వటంతో గిరిజ అర మీటరు పొడుగు జుట్టు , ఆ అందం , డిగ్రీ విత్ కంప్యూటర్ బాక్గ్రౌండ్ , తనకి సాక్షాత్తు ఎలిజెబెత్తు లాంటి తెలుగు కోడలు దొరికిందని వెంటనే తన కొడుక్కి ఈమెయిలు కొట్టింది. తిరుగు టపా లో ఈమెయిల్ తో సహా వచ్చి పడ్డాడు పరశురాం.

రెండు నెలలదాకా మాయని నల్ల రంగొకటి (హెయిర్ డై) తగిలించాడు పరశురాం. ఆ క్రీము ఈ క్రీములన్ని పూసి పెళ్లికొడుకులా తయారయ్యాడు. వచ్చిన మరుసటి రోజే గిరిజని సందు చివ్వరున్న కాఫీ కొట్టు దగ్గర కలసి మాట్లాడాడు. వాలు జడలో వచ్చిన గిరిజ పరశురాం మనసు దోచేసింది. పెళ్లి చీరగా ఓ రెడ్ కలర్ కంచి పట్టు చీర కొంటే దానికి మాచింగుగా తెల్లని మల్లెపూలు, ఎర్రని కనకాంబరం మరియు నల్లని జుట్టు తో వచ్చే సత్యభామ పూల జడొకటి ఆర్డరిచ్చింది గిరిజ.


పెళ్లి ముహూర్తం రాత్రి 12:45 ని కి అయినా పూల జెడ ప్రొద్దున్నే తగిలించుకుని కూర్చుంది గిరిజ. రాత్రంతా హోమాలు పూజలతో , పెళ్లి కొడుకుకి కొంచెం టేన్ అయ్యి నల్ల పడ్డాడు, జుట్టు కాస్త రంగు తేలింది , పెళ్లి కూతురు పూల జడ ఘనాపాటి గారి ముడి లాగ కాస్త వెనక్కి మళ్ళింది. పెద్దల ఆశీర్వచనాలతో పెళ్లి పండగ చక్కగా ముగిసింది.

పరశురాం , గిరిజ బయలుదేరి ఇంగ్లాండు వచ్చేస్తే అత్తగారు తీర్థయాత్రలకని ఓ నాలుగు నెలలు ప్రయాణం కట్టింది. కొత్త ప్రదేశం నీళ్లు పడక కొంత, చలికి కట్టుకున్న మఫలర్ వల్ల కొంత తరిగి నెలలోనే గిరిజ సిరోజాలు దిగజారాయి. యాత్రల్నించి వచ్చిన అత్తగారు కోడల్ని చూసి గొల్లుమంది. కాని మనవడో మనవరాలో పుడతారన్న శుభవార్త విని సంబరపడి ఆ పుట్టే వాళ్ళయినా ఏ విక్టోరియాలాగానో లేక అమితాబ్ బచ్చన్ లాగానో వుండాలని తన వూహా లోకంలో తేలింది...

భారీ ఠీవి - జనవరి 2008

1980 లో మనకి టీవీ వచ్చినప్పుడు దాని వల్ల వచ్చే వుపయోగాలగురించి చాల చర్చించుకున్నాం. టీవీ ప్రపంచాన్ని ఒక చిన్న డబ్బాభందించి మనకి కావలసిన పరిమాణాలలో సరుకు అందించేది. మొదట మూడు గంటలలోనే అన్ని కార్యక్రమాలు ముగించిన అదే టీవీ ఈనాడు ముప్పై గంటలు అరవై ఛానళ్ళు వున్నా మనని సంతృప్తి పరచలేక పోతోంది. డబ్బా భాషలో చెప్పాలంటే, ఎవరికి ఏమికావాలంటే ఈ డబ్బాలోంచి తీసుకోవచ్చు. ఒకసారి చెయ్యి పెడితే 100 రకాల సరుకు, పుచ్చులైనా రావచ్చు చచ్చులైనా రావచ్చు. రామాయణ మహాభారతలతో పాటు ఇంటింటి రామాయణాలు పక్కింటి భాగోతాలు ఎక్కువగా కనపడతాయి. గ్రంధాలకంటే ఇవే బాగా రుచిగా వుండటంతో ఇంటిల్లిపాది పనులు పక్కనేట్టి ఈ రుచి మరిగారు. దీనికి తగ్గట్టు కంపెనీలు కూడా పోటీ పడి వాళ్ల ప్రోడుక్టు యాడ్లు ఎంత డబ్బిచైన వేయించుకోడానికి సిద్ధమవుతున్నారు. ఇదిలావుండగా, కుట్రలు కుతంత్రాలతో నిండిన ఆ సన్నివేశాలు మిస్ కాకుండా చూస్తున్న కుటుంబాలలో ప్రశాంతత క్షీణించి బీపీలు గుందేనేప్పులు ఎక్కువైయ్యాయి. ఇంక టీవీ ముందరనించి కదలకుండా సీన్లతో పాటు తిన్న తిండిని కూడా అరిగించుకున్దామనుకునే సతీమణులకి నిరాశ ఎదురవుతోంది. వారి కుటుంబాన్ని పట్టించుకునేందుకు టైము లేకుండా ఆ డబ్బాలో మునిగిపోయిన వారి పిల్లల చదువులు టపాకట్టే ప్రమాదముందని గుర్తించలేకపోతున్నారు.

2007 ఏప్రిల్ లో ఒక విచిత్రమయిన స్టడీ చేసారు. జనాభాయోక్క ఎవరేజ్ వైటు 8 కిలోలు పెరగటానికి కారణమేమిటని? దీనికంతతకి కారణం తిండి తిని పనీ పాటా చేయకుండా టీవీకి అతుక్కుపోవటమేట! ఆడవాలు పది కేజీలు మగవాళ్ళు ఆరు కేజీలు పెరిగారట, మరి ఆఫీసులో టీవీలు లేవుగా మరి!!!