ఆ రోజు అక్టోబర్ పది అంటే చెన్నై లో అన్ని రోజుల్లాగానే మండే ఎండ. మేము హైదరాబాద్ వెళ్లేందుకు స్టేషన్ కి బయలుదేరాము. మా వూళ్ళో నీళ్ళతో రెండు సార్లు , ఎండ వుక్క తో మరి ఆరు సార్లు స్నానం చేస్తాం.
స్టేషను చేరే సరికి నా సిల్కు చొక్కా కలర్ మారింది (చెమటకి ముద్దయ్యి). ట్రైన్ ఎక్కి కూర్చున్నాము నేను నా భార్య శారద. మా ఊరి ప్రత్యేకతేమిటంటే సరిహద్దుల దగ్గిర మురుగు కంపు తో ఆహ్వానిస్తుంది మళ్ళీ అదే వాసన తో సాగనంపుతుంది. అలాగే ఆ రోజు కూడా మమ్మల్ని వుక్కిరి బిక్కిరి చేసింది.
ట్రైన్ ఓ మోస్తరు స్పీడు అందుకోవటంలో , నా చొక్కామీద కొత్త మేప్స్ తయారయ్యాయి... సిల్కు చోకా మీద చేమటారుతుంటే అంతే. చెన్నై వాసులికి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. "అమ్మయ్య ఇంక హాయిగా ఓ కునుకేయ్యచ్చు" అనుకుంటూంటే పక్కనే వున్న ఓ ఫ్యామిలీ సరదాగా తమిళంలో అంతాక్షరి అందుకున్నారు. నా వైఫ్ రాబోయే ముప్పుని పసిగట్టి నా ఐపాడ్ లాక్కుని యియర్ ఫూన్లు తగిలించుకుని సెటిల్ అయింది.
"ఇదెప్పుడూ ఇంతే.. సరదాలే లేవు.. ఎంచక్కా మనం కూడా కాసిని పాటలు పాడుకోవచ్చు..
సర్లే , దాని అదృష్టం అంతే ... మరి నా అద్రుష్టానికొస్తే..
ఇంతట్లో పల్లీల వాడొస్తే అందరికీ పల్లీలు కొనిపెట్టా
"చెన్నై పల్లీలు చాల బాగుంటాయండి" అన్నాను "ఎస్. నిండా బాగుందండి" అన్నారు. " మీరు చెన్నై లో వర్క్ చేస్తారా" అని అడిగా. "కాదండి అమెరికా లో దా వుందాము... లీవుకి ఒక మాసానికి వస్తిమి" అన్నాడు "నా పేరు రామన్ , నా వైఫ్ రాధ , పిల్లలు వాసన్ , దేవన్ " అని వాళ్ళని నాకు పరిచయం చేసాడు రామన్.
నాలుగు సంవత్సరాల తరువాత ఇండియా వెకేషన్ కొచ్చారట .
రామన్ పేరెంట్స్ చెన్నైలోను రాధ పేరెంట్స్ హైదరాబాదులోను వుంటారుట. చెన్నై వచ్చి చక్కగా అత్తగారి దగ్గర నాలుగు రోజులుండి ఆ మిగిలిన ఇరవై రోజులు తన పేరెంట్స్ తో వుందామని వెళ్తున్నామంది రాధ. అప్పుడ్నాకర్ధమయింది అత్తా కోడళ్ళు చెన్నై స్టేషనులో ఒకల్నోకల్లు విడిచి వుండలేనంత ప్రేమ ఒలకబోసుకున్నారో అని ... బండి కదలగానే రాధ మంచి హుషారయిన పాటలన్దుకుంది. మొగుడికి ఓ మంచి ఇళయరాజా పాట అందించింది, రామన్ మాత్రం విషాద గేయాన్ని అందుకున్నాడు..
ట్రైను స్పీడుతో పాటు వీళ్ళ పాటల సెలక్షన్ కూడా పెరిగింది. పై బెర్తుల్లోకేక్కిన పిల్లలు కూడా రంగంలోకి (రణరంగం అనాలి) దిగారు. ఆ పక్కనే నా తోడుగా వున్న నా భార్య నన్నొదిలి హాయిగా గురక పెడుతోంది. పిల్లలకి ఇంగ్లీషు , తమింగ్లీషు, తెలుగీషు , హింగ్లీషు వచ్చేమో, నాలుగు భాషలలో పాడి కంపార్టుమెంటులో వున్న అందరినీ భాద పెడుతున్నారు. బహుశా రామన్ డాలర్లు ఒలకపోసి అమెరికాలో సంగీతం నేర్పించినట్టున్నాడు, వాసన్ శంకరాభరణం పాటలందుకున్నాడు. శంకరశాస్త్రి కోచ్చినంత కోపం వచ్చి శారదా..... అని ట్రైన్ డ్రైవరుకు వినిపించేలా అరుద్దామనుకుంటే పక్కనే పడుకున్న నా పెళ్ళాం శారద లేచి తన పాట అందుకుంతుదేమో...అన్నా భయం.
నే మొక్కిన దేముళ్ళు కరుణించి... వెంట వెంటనే ఓ నాలుగు గూడ్సు బండ్లని పంపారు. ఓ అయిదు నిముషాలు పాటు ట్రైన్ సౌండుతో కంపార్తుమేంట్లో అందరూ రిలాక్సయ్యారు. ఇంతట్లోనే తీసీ కూడా వచ్చి టికెట్స్ చెక్ చేసి పారిపోయాడు. ఇంకెక్కడికి సీటు మార్చడం కుదరదన్నాడు.
బయట సౌండ్లు సద్దుమనిగాక మల్లి అందుకున్నారు అంతాక్షరి .. లక్కీ గా ట్రైన్ ద్రైవరికి మెసేజ్ అందిందో ఏమో, ట్రైన్ స్పీడ్ పెంచాడు. దాంతో ట్రైను సౌండు వీళ్ళ సౌన్డుకన్నా ఎక్కువవ్వటంతో కాస్త నీరసించారు...
నా ఫోకస్సంతా ఆ ఆరవ ఫ్యామిలీ మళ్ళీ అరవకుండా చేయడం ఎలా అనే దాని మీదే వుంది. ఇంతలోకే శారద నిద్ర లేచింది. పెళ్ళయి పదేళ్ళలో... నేను కూడా ఇంత భాద పెట్టలేదని నా మీద చాల జాలి పడింది. ఈ హక్కు తనకోక్కత్తికే పరిమితమని .. దీనికి రామన్ గాంగ్ కారణమని తెలుసుకుని వాళ్లకి మా అమెరికా ట్రిప్ విషయాలు చెప్పటం స్టార్ట్ చేసింది. దాంతో అన్ని నోళ్ళూ మూతబడ్డాయి. శారద బిజీ అయిపోయింది... రామన్ కి చెమటలు పట్టాయి....
బిక్క మొహంపెట్టి ఎప్పుడు ఇంకో నాలుగు గూడ్సు బండ్లు వస్తాయా అని కిటికీలోంచి నిముషానికి పది సార్లు తొంగి చూస్తున్నాడు...
Tuesday, 24 March 2009
Subscribe to:
Comments (Atom)