అమలాపురంలో ఐదో తరగతి దాకా చదివి ఆరో తరగతినించి లండన్ లో వెలగబెట్టిన పరశురాం ముప్పై అయిదేళ్లకు బాగా సెటిల్ అయ్యాడు. ఇంక పెళ్లికి వేళాయెరా అని పిల్లని వెతకమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు వాళ్ల అమ్మకి. ఫ్రీ మ్యుసియుమ్సులో చాలా సార్లు ఎలిజెబెత్ రాణి ఫోటోలు చూసిన తల్లి నరసమాంబకి అలా తెల్లగా మంచి పొడుగైన జుత్తుతో వుండే పిల్లే తన కొడుక్కి సరయిన జోడి అని డిసైడ్ చేసింది. పరశురాం చూడ్డానికి నల్లగా వున్నా జుట్టు మట్టుకు తెల్లగా వుంటుంది. కళ్లు చిన్నగా వున్నా ముక్కు మట్టుకు పెద్దగా వుంటుంది. ప్రొఫెషనల్గా బాగా సక్సెస్ అయ్యాడు పరశురాం. బీయండబల్యూ కారు, రోలేక్సు వాచీ , కొత్త సెల్ఫోన్లతో ఎప్పుడూ కళకళ లాడిపోతుంటాడు. నరసమాంబ మట్టుకు తన కొడుకు లాంటి ఆరడుగులు అందగాడు దొరకాలంటే బక్కెట్టు బక్కెట్ల పుణ్యం చేసుకుని వుండాలి అని వూహాలోకంలో వుంటుంది. సొంత వూరైన అమలాపురంకి ఈ పనిమీద వెంటనే పెట్టె బేడా సద్దుకుని వెంటనే బయలు దేరింది...
తన కొడుకు ఫోటోలు అన్ని మ్యారేజ్ బ్యూరోలలోను (అంటే సంత), డాట్ కాంలలోను యాడ్ ఇచ్చి ఎంచక్కా కూర్చుంది. 10 ఫోటోలు 20 ఫోన్ కాల్స్ 50 ఈమైల్సు వచ్చాయి... కానీ ఫోటోకి మనిషికీ నందికి పందికి వున్నంత తేడావుంది. అసలు తన కొడుక్కి తననుకున్నట్లు పిల్ల దొరుకుతుందా అని బెంగ పెట్టేసుకుంది నరసమాంబ. అమ్మే వాళ్ళెప్పుడు సరుకు ఫ్రెష్షే అనుకుంటారు...పుచ్చులూ చచ్చులూ కొనే వాళ్ళకే తెలుస్తుందన్నట్టు.. డిగ్రీ ఎలాగో గట్తెక్కించి పక్క సందులో వున్న పాక్స్-అకాడమీ లో అంటే పాపయ్య అకాడమీ అఫ్ కంప్యుటర్సులో డిప్లొమా పూర్తి చేసింది గిరిజ. పక్కింటి తాతగారు గిరిజ ఎ అమెరికాలోనో ఆస్ట్రేలియా లోనో సెటిల్ అవుతుంది అని అమ్మాయిని అడిగి చేసుకుంటారని చెప్పటంతో గిరిజ తండ్రి సుందరం గిరిజకి ముప్పై ఏళ్ళొచ్చినా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నాడు. ఇంక ఏమి సంబంధాలు రాక పోయే సరికి ఇంక ఈ వెధవ జాతకాలని నమ్మి కూర్చుంటే తన కూతురుకి ఏ ముసలో ముతకనో కట్టబెట్టడం ఖాయమనుకుని , గిరిజ ఫోటో , బయోడేటాని అన్ని మ్యారేజ్ సంస్థలలోనూ నమోదు చేసాడు. ఇంటర్నెట్ పెళ్లి సంతలలో కూడా ఫోటో పెట్టాడు. గిరిజ చదువు తెలివితేటలలో కొంచం తక్కువైనా మంచి అందగత్తె. అందం పెరుగుతున్న కొద్ది బుర్ర మీద జుట్టు తగ్గుతూ వచ్చింది. డెబ్భై అయిదు చానల్స్ లో వచ్చే అన్ని మందులూ, క్రీములూ వాడింది. కాని రోజు రోజుకి తరుగుదల పెరిగిపోతోంది. తొందరగా పెళ్ళయితే వున్నా వూడినా ఇంక పట్టించుకోవక్కరలేదులే ఎలాగూ మొగుడుకి వున్న కాస్త వూడటం ఖాయమని ధీమాగా వుంది గిరిజ.
సుందరం అన్నయ్య అమలాపురం లో నరసమాంబ గారి ఎదురింట్లోనే వుండడంతో, గిరిజ ఫోటో, బయో-డేటా తో సహా వచ్చింది. ఇరవై రెండవ ఏట తీయించుకున్న ఫోటో అవ్వటంతో గిరిజ అర మీటరు పొడుగు జుట్టు , ఆ అందం , డిగ్రీ విత్ కంప్యూటర్ బాక్గ్రౌండ్ , తనకి సాక్షాత్తు ఎలిజెబెత్తు లాంటి తెలుగు కోడలు దొరికిందని వెంటనే తన కొడుక్కి ఈమెయిలు కొట్టింది. తిరుగు టపా లో ఈమెయిల్ తో సహా వచ్చి పడ్డాడు పరశురాం.
రెండు నెలలదాకా మాయని నల్ల రంగొకటి (హెయిర్ డై) తగిలించాడు పరశురాం. ఆ క్రీము ఈ క్రీములన్ని పూసి పెళ్లికొడుకులా తయారయ్యాడు. వచ్చిన మరుసటి రోజే గిరిజని సందు చివ్వరున్న కాఫీ కొట్టు దగ్గర కలసి మాట్లాడాడు. వాలు జడలో వచ్చిన గిరిజ పరశురాం మనసు దోచేసింది. పెళ్లి చీరగా ఓ రెడ్ కలర్ కంచి పట్టు చీర కొంటే దానికి మాచింగుగా తెల్లని మల్లెపూలు, ఎర్రని కనకాంబరం మరియు నల్లని జుట్టు తో వచ్చే సత్యభామ పూల జడొకటి ఆర్డరిచ్చింది గిరిజ.
పెళ్లి ముహూర్తం రాత్రి 12:45 ని కి అయినా పూల జెడ ప్రొద్దున్నే తగిలించుకుని కూర్చుంది గిరిజ. రాత్రంతా హోమాలు పూజలతో , పెళ్లి కొడుకుకి కొంచెం టేన్ అయ్యి నల్ల పడ్డాడు, జుట్టు కాస్త రంగు తేలింది , పెళ్లి కూతురు పూల జడ ఘనాపాటి గారి ముడి లాగ కాస్త వెనక్కి మళ్ళింది. పెద్దల ఆశీర్వచనాలతో పెళ్లి పండగ చక్కగా ముగిసింది.
పరశురాం , గిరిజ బయలుదేరి ఇంగ్లాండు వచ్చేస్తే అత్తగారు తీర్థయాత్రలకని ఓ నాలుగు నెలలు ప్రయాణం కట్టింది. కొత్త ప్రదేశం నీళ్లు పడక కొంత, చలికి కట్టుకున్న మఫలర్ వల్ల కొంత తరిగి నెలలోనే గిరిజ సిరోజాలు దిగజారాయి. యాత్రల్నించి వచ్చిన అత్తగారు కోడల్ని చూసి గొల్లుమంది. కాని మనవడో మనవరాలో పుడతారన్న శుభవార్త విని సంబరపడి ఆ పుట్టే వాళ్ళయినా ఏ విక్టోరియాలాగానో లేక అమితాబ్ బచ్చన్ లాగానో వుండాలని తన వూహా లోకంలో తేలింది...
Idi matuku Super. Memu andaramu navvukunnamu, the story is good and represents the current scenario of marriage in India.
ReplyDeleteBandamuukku Sundaram pottimukku Pankajam kaliste elavuntundo oka Hasyapravachanam cheste baguntndi
ReplyDeleteRamana Rao V V
really it resembles the present marriage settlements in India. Haasyabrahma name immediately remembers Hasya brahma Jandhyala and his creations Sutti. You continue to write on Good titles in changed scnario.
ReplyDeletefor example if you see old pictures of Realangi era you will enjoy a good humour written by those time writers.Bhamidipati Kameswarrao wrote a good comedy in 1930s.Bhamidipati Radhakrishna wrote good no of comedy plays in 1960s and they are well received at that time. Next era belong to Haayabrahma Jandhyala.
Keep up your talent and write good comedy